వాషింగ్టన్ (అమెరికా) : అమెరికాలో కనిపించకుండాపోయిన వందల కోట్ల విలువైన ఫైటర్ జెట్ శకలాలు లభ్యమయ్యాయి. సౌత్ కరోలినాలోని విలియమ్స్‌బర్గ్ కౌంటీలో విమానం శకలాలను గుర్తించినట్లు యూఎస్ మిలటరీ ప్రకటించింది. ఈ శిథిలాలను సేకరించడానికి స్థానికులను అక్కడి రాకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఆదివారం దక్షిణ కరోలినాలోని బ్యూఫోర్ట్ ఎయిర్ స్టేషన్ నుంచి బయలుదేరిన ఫైటర్ జెట్ ఎఫ్-35 బి జాడ లేకుండా పోయిన సంగతి తెలిసిందే. దీని జాడ తెలిస్తే వెంటనే చెప్పాలంటూ అధికారులు సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక పలు ఫ్లైట్ ట్రాకింగ్ సైట్‌లు విలియమ్స్‌బర్గ్ కౌంటీలోని స్టకీకి సమీపంలో ఉన్న అడవుల్లో సంచరించినట్లు సూచించాయి. మరోవైపు ఈ విమానం కూలడానికంటే ముందే పైలట్ పారాచూట్ సాయంతో దాని నుండి సురక్షితంగా బయటపడ్డాడు.