
హైదరాబాద్ : నాంపల్లి అగ్ని ప్రమాద సంఘటన జరిగిన నేపథ్యంలో మరణించిన కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయం ప్రకటించారు. ఒక్కో మృతుని కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్‌లో అగ్ని ప్రమాద స్థలాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా నాంపల్లి బజార్ ఘాట్‌లో అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులని అడిగి తెలుసుకున్నారు . నాంపల్లి బజార్ ఘాట్‌లో అగ్ని ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఇక ఈ అగ్ని ప్రమాద ఘటనపై విచారణ చేస్తామని, నిందితులను వదిలిపెట్టబోమని వివరించారు.