ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : మండలంలోని పాలతోడు గ్రామానికి చెందిన ఫెర్టిలైజర్ దుకాణ యజమాని పిల్లా శ్రీనివాస్ సీతా పద్మావతి దంపతుల కుమారుడు తేజ పుట్టినరోజు సందర్భంగా ... ఆదివారం స్థానిక మయూరి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 40 మంది వృద్ధులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లా తాతాలు, పిల్లా సత్యానందం, అన్నందేవుల సూర్యచంద్రరావు, రేగులబంద గోవిందు, తదితరులు పాల్గొన్నారు.










