
జెండా పండగ వచ్చింది
ఆనందాలను తెచ్చింది
స్వేచ్ఛ కోసము చెప్పింది
దేశభక్తితో మది నిండింది
మూడు రంగుల జెండా
భారతమాతకు అండదండ
వినువీధుల్లో ఎగురుచుండ
ఆనందమే కనుల నిండా
జెండా చేత బూని
తెల్లదొరలకు ఎదురొడ్డి
వందేమాతర నినాదమే
జాతి గుండెల్లో నిండినది
స్వేచ్ఛ కోసమే ఆరాటం
త్రివర్ణ పతాకమే మనకోసం
త్యాగమూర్తుల పోరాటం
స్వాతంత్రమే మన జీవనం
గాంధీ, నెహ్రూ శాంతి మంత్రం
భగత్‌సింగ్ రక్త తర్పణం
బానిస సంకెళ్ల విముక్తి కోసం
అంచెలంచెలా పోరాటం
లాలా లజపతిరారు
వెన్నుచూపని ధైర్యం
బాలగంగాధర్ తిలక్
వందేమాతర ఉద్యమం
మన్యం పౌరుషం అల్లూరి
బ్రిటిష్ వెన్నులో భయంకరి
మన నేతాజీ చూసిన దారి
ఆజాద్ హింద్ ఫౌజు
సత్యాగ్రహమే ఆయుధం
సాగింది మన ఉద్యమం
ఎందరో వీరుల త్యాగఫలం
స్వతంత్ర భారత దీప్తి ధనం!
- మొర్రి గోపి,
88978 82202