Aug 16,2023 16:45

ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమగోదావరి) : పాలకొల్లు, ఉల్లంపర్రు డా.సబిత జూనియర్‌ కళాశాలలో ఈ సంవత్సరం ఇంటర్‌ పూర్తి చేసుకున్న కడితల ధన్య శ్రీ జేఈఈ పరీక్షల్లో ర్యాంకు సాధించి అగర్తాల చీ×ులో సీటు సాధించింది. ఈ సందర్భంగా బుధవారం భీమవరం ఆర్డీవో దాసిరాజు ధన్య శ్రీ ను సత్కరించి, ఉల్లంపర్రు మాంటిస్సోరిస్‌ విద్యాసంస్థ బహుకరించిన రూ.2 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా దాసి రాజు మాట్లాడుతూ.. ఉత్తమ విద్యాబోధన అందించడంతో పాటు ఉన్నత విద్య కోసం పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించటం చాలా గొప్ప విషయమని ఈ విధంగా విద్యార్థులను ప్రోత్సాహిస్తున్న ఉల్లంపర్రు మాంటిస్సోరిస్‌ పలువురికి ఆదర్శంగా నిలిచిందన్నారు. సబిత కాలేజి సెక్రటరీ మద్దాల వాసు మాట్లాడుతూ.. మా విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థినుల్లో ప్రతిభ కలిగి వారు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్య కొనసాగించలేకపోతున్న వారికి అండగా ఉంటూ సహకారాన్ని అందిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ వసంతలక్షి, ఐఐటీ ప్రోగ్రాం కో ఆర్డినెట్టర్‌ వేగేశ్న అరుణ, మేనేజర్‌ రావాడ సతీష్‌ పాల్గొన్నారు.