Sep 22,2023 13:13

మొహాలి : వన్డే ప్రపంచకప్‌ ఆరంభానికి ముందు నేటి నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానున్న వేళ .. బరిలో దిగేందుకు భారత్‌ సన్నద్ధమయ్యింది. తొలి మ్యాచ్‌ మొహాలిలోని పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఐఎస్‌ బింద్రా స్టేడియం వేదికగా ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభకానుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన భారత్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది.

భారత జట్టు : గిల్‌, గైక్వాడ్‌, శ్రేయస్‌, కేఎల్‌ రాహుల్‌( కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌, జడేజా, అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, బుమ్రా, షమీ.

ఆస్ట్రేలియా జట్టు : డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబూషేన్‌, కామెరాన్‌ గ్రీన్‌, అలెక్స్‌ కారీ (వికెట్‌ కీపర్‌), మార్కస్‌ స్టోయినిస్‌, సీన్‌ అబాట్‌, పాట్‌ కమ్మిన్స్‌ (కెప్టెన్‌), జోష్‌ హాజిల్‌వుడ్‌, ఆడమ్‌ జంపా.