ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం డీఏ పెంచుతూ కేంద్ర క్యాబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం 42 శాతంగా ఉన్న డీఏ రేటును 46 శాతానికి పెంచింది. దీని వల్ల దాదాపు 48.67 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లు నేరుగా లబ్ధి పొందనున్నారు. నవంబర్ నుంచి ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. ఇందులో జూలై నుంచి అక్టోబర్ మధ్య కాలానికి సంబంధించిన బకాయిలు కూడా ఉంటాయి. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వానికి ప్రతి ఏటా రూ.12,857 కోట్ల భారం పడనుందని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.










