సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ నటిస్తోన్న సినిమా 'యానిమల్'. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను చిత్రబృందం విడుదలచేసింది. 'నాన్న నువ్ నా ప్రాణం' అంటూ సాగే ఈ పాటలో రణబీర్ కపూర్, అతని తండ్రి అనిల్ కపూర్ మధ్య ఉండే బంధాన్ని మనసుకు హత్తుకునేలా చూపించారు. ఐదు భాషల్లో ఈ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను అనంత శ్రీరామ్ రాయగా.. హర్షవర్దన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించారు. సోను నిగమ్ ఆలపించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కాబోతుంది.