Sep 17,2023 07:45

బ్రెజిల్‌ : బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఉత్తర అమెజాన్‌లోని బార్సిలోస్‌ ప్రావిన్స్‌లో విమానం కూలి 14 మంది మృతి చెందారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన బార్సెలోస్‌ ఉత్తర పట్టణంలోని బ్రెజిలియన్‌ అమెజాన్‌లో చిన్న విమానం కూలిపోవడంతో శనివారం 14 మంది మరణించినట్లు అమెజానాస్‌ రాష్ట్ర గవర్నర్‌ విల్సన్‌ లిమా ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా వెల్లడించారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. మృతిచెందిన వారిలో అమెరికా పౌరులు ఉన్నారని స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. స్పోర్ట్‌ ఫిషింగ్‌ కోసం రాష్ట్ర రాజధాని మనౌస్‌ నుంచి బార్సిలోస్‌కు విమానంలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని బ్రెజిలియన్‌ రాష్ట్ర భద్రతా కార్యదర్శి వినిసియస్‌ అల్మేడా తెలిపారు.