లీమా (దక్షిణ అమెరికా) : దక్షిణ అమెరికా దేశం పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 24మంది మృతి చెందారు. మరో 35మందికి తీవ్రగాయాలయ్యాయి.
ఆండెస్ పర్వతాల మీదుగా హుయాన్యాయో నుంచి హువాంటా వెళుతున్న బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా 200 మీటర్ల లోతులో ఉన్న లోయలో పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 24 మంది మృతి చెందగా, మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఘటనాస్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. 'డెవిల్స్ కర్వ్'గా పిలిచే ప్రమాదకరమైన ప్రదేశంలో ఈ దుర్ఘటన జరిగిందని పెరూ పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారని, కరీబియన్ దేశం హైతీకి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. కొరియాంకా టూర్స్ కంపెనీ బస్సు లిమా నుంచి బయలుదేరి ఈక్వెడార్ సరిహద్దులోని టుంబేస్‌కు వెళ్తోందని ఈ క్రమంలో బస్సు ఆర్గానోస్ నగరం సమీపంలో అదుపుతప్పి కొండపై నుంచి పడిపోయిందని.. ఇది డేంజరస్ స్పాట్ అని పోలీసులు వివరించారు.