
తమిళనాడు : పండుగ రోజున తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును కారు ఢీకొట్టడంతో ఏడుగురు మృతి చెందిన ఘటన తిరువణ్ణామలై సమీపంలోని సెంగం పక్రిపాళయం సెంగం బైపాస్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఎనిమిదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. అర్థరాత్రి కావడంతో డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై విషయం తెలుసుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.