ప్రజాశక్తి- కర్నూలు కల్చరల్ : ఆధునిక నవలా, కథాసాహిత్యంలో వందల కథలు పద్నాలుగు నవలలు రాసి జీవిత పర్యంతం రచనలకే సమయాన్ని కేటాయించిన సుప్రసిద్ద రచయిత్రి చక్కిలం విజయలక్ష్మి(75) మృతి సాహిత్యరంగానికి తీరనిలోటని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ అన్నారు. మానవసంబంధాలు, కుటుంబవ్యవస్థ, జీవన సంఘర్షణలు, సంక్లిష్టమైన మనోవైజ్ఞానిక కోణం ఆమె రచనల్లో వస్తువులని స్త్రీజీవితాన్ని తన రచనల్లో ఉన్నంతంగా మలిచారని అన్నారు. తన రచనలతో ఒక తరాన్ని ప్రభావితం చేశారని తెలిపారు. సాహితీస్రవంతి జిల్లా గౌరవాధ్యక్షులు యంపి బసవరాజు, జిల్లా కార్యదర్శి డి. అయ్యన్నలతో కలసి ఆమె భౌతికకాయాన్ని సందర్శించి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతిని ప్రకటించారు. చక్కిలం విజయలక్ష్మి సాహిత్యాన్ని సామాన్యజనంలోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత కర్నూలు సాహిత్యకారులపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
చిక్కలం విజయలక్ష్మి గురించి గతంలో ప్రజాశక్తి కర్నూలు దినపత్రిక కర్నూలు కవనం శీర్షికలో కవి కెంగార మోహన్ రాసిన వ్యాసం...
చక్కని తెలుగు నవలకు చిరునామా 'చక్కిలం విజయలక్ష్మి'
120 ఏళ్ళ వయస్సుకలిగిన తెలుగు కథాసాహిత్యంలో లక్షల కథలచ్చాయి. వేలకథా సంపుటిలు వచ్చాయి, వస్తున్నాయి. అన్నీ పాఠకుల్ని మెప్పుస్తున్నాయా ? కథను మంచి వస్తువుతోనో, భాషతోనో, లేదా ఒక సమస్యను లేదా సంఘటనను ఇతివఅత్తంగా తీసుకొని రాయడం పరిపాటే. నాలుగైదు కథలు ప్రచురితమయ్యేసరికి భుజాలు ఎగరేసుకునే కథా రచయితలున్న ఈ రోజుల్లో సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన కథలు అడపాదడపా మాత్రమే వస్తున్నాయి. కథ బాగుందన్న మాత్రానా కథ బాగుంటుందా ? రాసిన కథ సమాజంపై చాలా ప్రభావం చూపాలి. సమాజానికి దిశా నిర్దేశనం చేయగలిగి వుండాలి. కథ చదివితే ఏడుపొచ్చిందంటారు. మానవీయకోణాన్ని స్పఅశించిందంటారు. మరి సమాజక్షేత్రంలో ఆ కథ ఎన్నాళ్ళు నిలబడగలుగుతుంది అన్నది ముఖ్యం. వాస్తవాలు రాయడమో, సంఘటనలు రాయడమో, పతనమవుతున్న మానవతా, నైతికవిలువలు రాయడమొక్కటే కాదు. కథ కొత్త సందేశం ఇవ్వాలి, ఆధునిక తరానికి సామాజిక స్పఅహతో కూడిన బాటలు వేయాలి. పాలకులు సమాజం గూర్చి ఆలోచించి ప్రగతి పథాన దేశాన్ని నడిపేందుకు దోహదపడాలి. నాలుగు చప్పట్లు కొట్టినంత మాత్రానా గొప్ప సాహిత్యం పురుడుబోసుకోదు. అవే చేతులకు పిడికిలి బిగించే శక్తి కావాలి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాకు చెందిన రచయిత్రి చక్కిలం విజయలక్ష్మి గూర్చి పరిచయం చేయాలన్న సంకల్పంతో చేసిన ప్రయత్నమే ఈ వారం కర్నూలు కవనం ప్రత్యేకం....
ఆంధ్రదేశమంతా తెలిసిన పేరే. కానీ ఎవ్వరికీ కనపడదు. గఅహిణిగా తన పనేదో తను చేసుకుంటూ రచనలు చేస్తూ ఆంధ్రదేశమంతా ప్రసిద్ధి పొందిన రచయిత్రి చక్కిలం విజయలక్ష్మి. పేరు వినగానే ఈమెది కర్నూలా ? అని ఆశ్చర్యపోతారు. ఏదో పాతతరం వారికి మాత్రమే తెలిసి వుంటారు. అరవై ఏళ్ళు పైబడ్డ ఈ రచయిత్రి కర్నూలు నగరంలో రుక్మిణమ్మ, కఅష్ణమూర్తి దంపతులకు జన్మించారు. స్థానిక బాలికోన్నత పాఠశాలలోనే సెవెన్త్ ఫారం ఆంటే ఇప్పటి ఇంటర్మీడియేట్ వరకు చదివారు. కేవిఆర్ మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. పారిశ్రామికవేత్త శ్రీనివాసరావును పెళ్ళాడారు. ఆ దంపతులకు ఇద్దరబ్బాయిలు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. చదువుకునే రోజుల్లోనే తెలుగు భాషా సాహిత్యాలను అమితంగా ప్రేమించారు. చిన్నప్పటినుంచే రచనలు చేయడం ఆరంభించారు. 1973లోనే వీరి కథ పూలవనం ప్రచురితం అయ్యింది. 1975లో మరుభూమిలో మల్లెతీగలు నవల రాశారు. కథలు, నవలలు విరివిగా రాయడం ఆరంభించారు. 1973 నుండి 1983 వరకు ఉజ్వల వారపత్రికలో సహజ సంపాదకులుగా పని చేశారు. వీరి సాహిత్యాభిలాషను గమనించిన సంపాదకులు మనోహరరావు ఆమెతో సంపుటి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. 1977లో ఆంధ్రప్రభ వారపత్రికలో తండ్రులూ తీర్పుమీదే ! నవల సీరియల్‌గా ప్రచురితమైంది. అలాగే శాంతితీరం నవల కూడా ధారావాహికంగా ప్రచురించబడిరది. దేశం నలుమూలలా ఈమె నవలలకు పాఠకులు వేలమంది అభిమానులు తయారయ్యారు. 1979లో బిందు అనే నవల వనితాజ్యోతిలో ప్రచురితమైంది. ఇదేమి న్యాయం మహిళ మాసపత్రికలో సీరియల్‌గా వచ్చింది. 1980లో కాగితపు పడవలో జీవితపు పయనం అనే నవలను కర్నూలు జిల్లా రచయితల సహకార ప్రచురణ సంఘం వారు ప్రచురించారు. దీన్ని సంఘం ప్రథమ మహాసభల సందర్భంగా ఆవిష్కరించారు. భాషా సాహిత్యాలపై పట్టు సాధించడానికి కారణం చిన్నప్పటినుంచి ప్రతి విషయాన్ని సూక్ష్మాతి సూక్ష్మంతో పరిశీలించి అవగాహన చేసుకోవడమే అంటారు. అలాగే బాగా చదవడం చిన్నప్పటినుంచి అలవాటుగా మారింది. పాలు అనే కథలో పిల్లల్ని అద్దెకు తెచ్చుకుని ఇళ్ళన్నీ తిరిగి అడుక్కుని బతుకీడ్చేవారి గూర్చి రాస్తే దానికి బహుమతి లభించింది. 1983లో ఆంధ్రభూమి వారపత్రికలో తెరతీయగ..రాదా నవల సీరియల్‌గా వచ్చింది. ఈ రాగానికి అదే తాళం ఆంధ్ర సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది. 1985లో ఆంధ్రభూమిలో సెంటర్ సీరియల్‌గా చిన్నారి చెల్లి తెలుగుపాఠకులను విశేషంగా అకట్టుకుంది. అన్వేషి అనే నవల భాషావైవిధ్యాన్ని, శిల్ప సౌందర్యాన్ని కలిగి వుంటుంది. 10 కవితలు ప్రచురితమయ్యాయి. అనేక రేడియో నాటికలు రాశారు. చక్కిలం విజయలక్ష్మి రాసిన నవలను తెలియకుండా, హక్కులు పొందకుండా సినిమా కూడా తీశారు. ఆమె ఇప్పటివరకు రాసిన 60కు పైగా కథలన్నీ ప్రచురితమయ్యాయి. నీ గుండె కార్చిన కన్నీరు, పడవ ప్రయాణం, కాకిగూడు, ప్రేమంటే తెలుసా నీకు, పాలు, అంత్యక్రియలు, శాంతికి శిలువ, జ్ఞాన నేత్రం, గంగాజలం అనే కథలు తెలుగు కథా సాహిత్యంలో సంచలనాలు. గుండెకార్చిన కన్నీళ్ళు, జ్యేష్టభాగం, చంద్రమతి రచనలకు ఎన్నో బహుమతులచ్చాయి. శరత్, త్రిపురనేని గోపిచంద్, రా.వి.శాస్త్రి అమితంగా చదివే ఈ రచయిత్రి సమాజాన్ని ప్రతిబింబించే రచనలకే ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పటివరకు 14 నవలలు రాసి తెలుగు నవలాసాహిత్యంలో నవలా రాణి అనిపించుకున్నారు. కర్నూలు జిల్లా చరిత్రను రాస్తే దాన్ని ఆంధ్రభూమి దినపత్రికలో ధారావాహికంగా ప్రచురించారు. ప్రస్తుతం ఈనాడు దినపత్రికలో అంతర్యామి అనే ఆధ్యాత్మిక శీర్షికను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 300పైగా అంతర్యామి రాశారు. ఈనాడు సాహిత్య మాసపత్రిక తెలుగు వెలుగులో ప్రేమలేఖల పోటీలో బహుమతి వచ్చింది. ఫెమినిస్టు ధఅక్ఫథం కలిగినప్పటికీ మానవసంబంధాలను ప్రేమించే రచయిత్రిగా ఆమె రచనల్లో కనిపిస్తారు. విస్మరించిన ఆత్మశక్తి వ్యాసంలో '' ఈనాడు స్త్రీజాతి గతాన్ని ఓ పీడకలగా ఓ కొత్త ఉషోదయాన్ని చూస్తోంది. అంది వచ్చిన ఈ వెలుగులో ఆమే ఎంతో ఎదగవలసివుంది.'' ఇలాంటి స్త్రీ చైతన్యాన్ని కలిగింగే వ్యాసాలెన్నో రాశారు. నీవో సగం...నేనో సగం వ్యాసానికి ప్రసిద్ధ చిత్రకారుడు బాపు బమ్మవేశారంటే సామాన్య విషయం కాదు. అరవైలో ఇరవై అయితే వార్ధక్యం కూడా సార్థకమే, స్థైర్యంలో ఎంతో ఎత్తు అనే వ్యాసాలు అలోచింపజేస్తాయి. సమాజానికి మేలు చేసే రచనలు చేయాలని, ప్రతి రచన వెనుక సామాజిక స్పఅహ వుండాలని, ఏమి రాసినా సమాజాన్ని దఅష్టిలో పెట్టుకుని రాయాలని, కవులు, రచయితలు రెండుతరాలు ముందుండాలంటారు. రాశామని అనిపించుకోవడానికి ఎప్పుడూ రాయకూడదని సమాజహితంకోరి కలం కదలాలని బలంగా నమ్మే చక్కిలం విజయలక్ష్మి మరెన్నో రచనలతో కర్నూలు సాహిత్య చరిత్రలో విశిష్టమైన సాహితీపాత్ర పోషించాలని ఆశిద్ధాం. - కెంగార మోహన్, కర్నూలు.
(ఆమె అకాల మరణానికి శ్రద్దాంజలి ఘటిస్తూ...)