హైదరాబాద్ : ఎడ్‌టెక్ వేదిక ఫిజిక్స్ వాలా (పిడబ్ల్యు) కొత్తగా ఫిజిక్‌స వాలా ఇన్స్‌ట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. దీంతో తాను అందించే కోర్సులను, బోధన విస్తరణతో విద్యకు సరికొత్త నిర్వచనం ఇవ్వాలని నిర్దేశించుకున్నట్లు పేర్కొంది. స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో అద్భుతమైన విజయాన్ని దక్కించుకోవడంతో తాజాగా స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇది మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ కాగా, ఇది భవిష్యత్తులో నిర్వహణ, సాంకేతికత క్షేత్రాలతో బిజినెస్, ఎంటర్‌ప్యూనర్‌షిప్‌లో భవిష్యత్తు నాయకులను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేయబడిందని ఆ సంస్థ సిఒఒ ఆదిత్య అగర్వాల్ పేర్కొన్నారు.