భారత రాజ్యాంగం పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జైభీం భారత్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు న్యాయవాది దోవా రమేష్ రాంజీ పేర్కొన్నారు.బాపట్ల జిల్లా రేపల్లె న్యాయస్థానం ప్రాంగణంలో లో గురువారం భారత రాజ్యాంగ పుస్తకాలను ఆవిష్కరించారు. దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగమును నిర్మించుకున్నామని చెప్పారు. పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయ ఆలోచనలతో పాటు భావ ప్రకటన స్వేచ్ఛను అంతస్తులు అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు రాజ్యాంగం మనకు అవకాశములు కల్పించిందన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌబ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి రాజ్యాంగం దోహదపడుతుందని చెప్పారు. కనుక పౌరులందరూ రాజ్యాంగాన్ని అభ్యసించి హక్కులు విధులు బాధ్యతలతో సమాజంలో ఉత్తమ పౌరులుగా నిలవాలని రాంజీ పిలునిచ్చారు. కార్యక్రమంలో న్యాయవాదులు కర్రా ప్రతాప్, నల్లూరి వెంకటేశ్వరవు, నాలాది పోతురాజు, రేవు నాగరాజు, ఎం.వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.










