ధర పెరిగినా అదే రాయితీ
వినియోదారులపై సిలిండర్ భారం
ప్రజాశక్తి- తిరుపతి టౌన్: చమురు సంస్థలు సిలిండర్ ధరలు పెంచుతూనే ఉన్నారు. ఏ మాత్రం ధరలు తగ్గించడం లేదు. నిత్యం గ్యాస్ ధరలు పెంచుతూ వినియోదారుల నడ్డి విరుస్తున్నారు. ధర పెరిగిన రాయితీ మాత్రం రూ19.20 పైసలు మించడం లేదు. పెరుగుతున్న గ్యాస్ ధరల భారం ప్రజలు మోయలేకపోతున్నారు. దీపం పథకంలో రాయితీనీ పెంచలేదు. ఉజ్జల పథకంలో రూ.200లు జమ చేయడం ఏమిటని వినియోగదారులు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. 2020లో సెప్టెంబర్‌లో గ్యాస్ ధర రూ.628.50లు ఉండగా మూడేళ్ల తర్వాత రూ.608.50లకు చేరుకోగా మళ్లీ ధర పెరిగి రూ.1137లకు చేరింది. అక్కడి నుంచి 17 నెలల పాటు ప్రతిసారి పెరుగుతూనే ఉంది. పర్యావరణ కాలుష్యం పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి గ్యాస్ సిలిండర్లు ఇచ్చింది. మహిళలు కట్టెల పొయ్యి వలన పొగ, కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారని వివిధ పథకాలతో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న గ్యాస్ సిలిండర్లు మంజూరు చేసింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఉజ్జల పథకాన్ని రెండు దఫాలుగా రాయితీ కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలు పెంచినప్పుడు కేంద్ర ప్రభుత్వం రాయితీని ఓ రకంగా ఇచ్చిపేదలకు తక్కువ ధరలకే సబ్సిడీతో సిలిండర్లు ఇచ్చేవారు. గత లబ్ధిదారులకు ఉజ్జల పథకంలో రూ.200లు అందజేసేవారు. దీపం పథకం సాధారణ పథకంలో ఉన్నవారికి రూ19.20లు జమ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వివక్షత ఎందుకు పాటిస్తా ఉందని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
మిగిలిన వారికి వర్తింప చేయాలి..
రాష్ట్ర ప్రభుత్వం 2000 -8వ సంవత్సరంలో దీపం పథకం కింద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సుమారు మూడు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. మూడేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం సుమారు 4,500 కనెక్షన్ ఇవ్వడం జరిగింది. కేవలం తక్కువ మందికి రాయితీలు ఇచ్చి మిగిలిన వారికి వర్తింపక చేయకపోవడం దారుణమని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేలా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా అడుగులు వేయాలని వినియోగదారులు కోరుతున్నారు.
2022 మార్చి నుంచి పెరిగిన ధరలు
తేదీ పెరిగిన ధరలు
22.3.2022 రూ.984లు
07.5.2022 రూ.1034లు
18.5.2022 రూ.10 37లు
06.7.2022 రూ.1087లు
1.3.2023 రూ.1137లు










