Aug 29,2023 16:59

ప్రజాశక్తి-సూళ్లూరుపేట (తిరుపతి) : సూళ్లూరుపేట రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో మన్నారు పోలూరులోని ఉన్నత పాఠశాలలో గిడుగు వెంకట రామమూర్తి పంతులు జన్మదినోత్సవం సందర్భంగా తెలుగు భాష వారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సామెతలు, పొడుపు కథలు, పద్యాలు, వ్యాసరచన, వకత్త్వం, తెలుగు భాషకు సంబంధించిన పాటలలో పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు డాక్టర్‌ సాయి బాబా, సుంకర ప్రతిమ, శేషగిరిరావు, అలవల సుధాకర్‌ రావు నేతృత్వంలో బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు అట్రంబాక దశరథ రెడ్డి, వినరు సాగర్‌, సాయిరాం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్‌ రెడ్డి, తెలుగు ఉపాధ్యాయులు జ్యోతిలక్ష్మి, వెంకటలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.