Sep 25,2023 10:30

పిల్లలూ ఓ పిల్లలూ...
అరవిరిసిన ఓ మల్లెలూ..

ఉదయపు వెలుగులు రావాలి
ఉరుకున మనమూ లేవాలి

సమతకు వారధి కావాలి
మమతల భావం తేవాలి

సామరస్యంగా ఉండాలి
ఈర్ష్యా ద్వేషం పోవాలి

తరులకు నీటిని పొయ్యాలి
బరువూ, బాధ్యత మొయ్యాలి

చెడు తలపులను ముయ్యాలి
కుహూకుహూ అని కుయ్యాలి

కలుపు మొక్కలను కొయ్యాలి
వ్యర్ధ వస్తువులను తియ్యాలి

- మీసాల చినగౌరినాయుడు,
94928 48564.