Oct 06,2023 13:26

ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్‌ కోనసీమ) : మండలంలోని ఏడిద గ్రామ అభివృద్ధికి పాలకవర్గంతో కలిసి కృషి చేస్తున్నామని గ్రామ సర్పంచ్‌ బూరిగ ఆశీర్వాదం అన్నారు. శుక్రవారం పంచాయతీ కార్యాలయం ఎదురుగా 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.10 లక్షల రూపాయల అంచనాతో అభివృద్ధి చేస్తున్న సీసీ రోడ్డు, డ్రైను నిర్మాణ పనులను పంచాయతీ మెంబర్లు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ బూరిగ మాట్లాడుతూ ... ఏడిద గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో పంచాయతీ మెంబర్లు చిలుకూరి బుజ్జి, కొండేటి కాళీకఅష్ణ, పైడిమళ్ల పెద్దబ్బులు, సొసైటీ చైర్మన్‌ రామిశెట్టి శ్రీహరి, మండల ఇంజనీర్‌ నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి వీర్రాజు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.