
చదువు చక్కని బంగారం
జ్ఞానానికది భాండాగారం
జీవితానికది జీవనాధారం
పదుగురిలో గొప్ప సంస్కారం
చక్కని మాటల నైపుణ్యం
చిక్కని మనసుకు శ్రీకారం
కమ్మని ఆటల ఉల్లాసం
పుస్తకాలతో సావాసం
క్రమశిక్షణకెంతో ఉపయోగం
విచక్షణ గుణమే మమకారం
విలక్షణమైనది ఉద్యోగం
చదువే మనకు పరిజ్ఞానం
అక్షరాలతో మనం మమేకం
మంచి లక్షణాలే వినియోగం
ఉత్తీర్ణతతోనే ఘన విజయం
ఆపై ప్రతిదీ జయం జయం
ప్రపంచ జ్ఞానం మన సొంతం
పరిశుద్ధతకే ఓటేద్దాం
పరిస్థితులను కనుగొందాం
చదివిన చదువుకు విలువిద్దాం
అందరితోను కలిసుందాం
చదువుకొమ్మని సలహానిద్దాం
అల్లరి పనులను మానేద్దాం
అమ్మ నాన్న పేరును నిలబెడదాం
మొరటుతనానికి స్వస్తి చెపుదాం
మేటి తనానికి చేయి కలుపుదాం
రేపటి పౌరులుగా ఎదుగుదాం
భావితరాలకి ఉపయోగపడదాం
నిరక్షరాస్యులను దగ్గర చేర్చుదాం
అక్షరాలను దిద్దించుదాం
అజ్ఞానాన్ని పోగొడదాం
విజ్ఞానులుగా తయారు చేద్దాం
బాగా చదివి పాసవుదాం
నిస్వార్థంగా జీవిద్దాం
అందరి బాగును కోరుకుందాం
వ్యవస్థను చక్కగా నడిపిద్దాం
- నరెద్దుల రాజారెడ్డి
96660 16636