Oct 15,2023 17:07

ప్రజాశక్తి-సూళ్లూరుపేట : సూళ్లూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ఆదివారం దసరా ఉత్సవాలను అంగరంగ వైభవముగా ప్రారంభించారు. వేదపండితుల సారధ్యంలో అమ్మణ్ణి ఎదుట కలిశా స్థాపన చేసి అనంతరం ఆలయ సమీపంలోని కాళంగి నదికి వెళ్లి నది జలాలకు పూజలు చేసి అక్కడి నుండి నది జలాలను తీసుకువచ్చి కలిశాలలో పోసి దసరా ఉత్సవ పూజలను ప్రారంభించారు.ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి కార్యనిర్వహణాధికారి ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డితో పాటు ట్రస్ట్ సభ్యులు ఈ ప్రారంభ పూజల్లో పాల్గొన్నారు.గణపతి పూజ చేసి,కలిశా పూజలు అనంతరం అఖండ జ్యోతిని వెలిగించి అమ్మణ్ణి చెంత ఉంచడం జరిగింది.ఈ పూజల్లో ఆలయ ట్రస్ట్ సభ్యులు ముప్పాళ్ల చంద్రశేఖర్ రెడ్డి,వంకా 
దినేష్ యాదవ్,ఓలేటి బాల సత్యనారాయణ,మన్నెముద్దు పద్మజ,బండి సునీత, నాగమణి తదితరులు పాల్గొన్నారు.