
ప్రజాశక్తి- నందిగామ (ఎన్‌టిఆర్) : నందిగామ పోలీస్ స్టేషన్ లో దసరా వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. విజయదశమి సందర్భంగా గత పది రోజులుగా కనకదుర్గమ్మ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమ, మంగళవారం నందిగామ సిఐ హనీష్ ఆయుధ పూజ విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ హనీష్ మాట్లాడుతూ ... చెడుపై విజయానికి ప్రతీక విజయదశమి అని, విజయదుర్గమ్మ ఆశీస్సులతో ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో నిండి ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లుతెలిపారు. ఆంధ్రప్రదేశ్ పాడి పంటలతో పచ్చగా కళకళలాడాలని తన తోటి పోలీస్ కుటుంబాలు, పట్టణ ప్రజలకు తన పై అధికారులకు, స్థానిక ఎమ్‌ఎల్‌ఎ, ఎమ్‌ఎల్ సి లకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ పండుదొర, ఏఎస్‌ఐ లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.