Oct 09,2023 13:37

ఒట్టావా : భారత్‌-కెనడా మధ్య వివాదం చెలరేగుతున్న వేళ ... కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో యునైటెడ్‌ అరబ్‌ అధ్యక్షుడితో భారతదేశం-కెనడా మధ్య వివాదం, ''చట్టాన్ని సమర్థించడం, గౌరవించడం'' ప్రాముఖ్యత గురించి ఫోన్‌లో ముచ్చటించారు. ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధంపై కూడా ట్రూడో మాట్లాడారు. సాధారణ పౌరుల ప్రాణాలను కాపాడాలని కోరారు. ఈ విషయాన్ని ట్రూడో ఎక్స్‌ ద్వారా వెల్లడించారు.

'' ఈ రోజు యూఏఈ అధ్యక్షుడు మహ్మద్‌ బిన్‌ జాయెద్‌తో ఫోన్‌లో మాట్లాడాను. ఇజ్రాయెల్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించాను. ఈ దాడులపై విచారం వ్యక్తం చేస్తూ.. సాధారణ పౌరుల జీవితాలను కాపాడాల్సిన అవసరంపై మాట్లాడాను. ఇండియాతో సంబంధాలపై కూడా చర్చించాం.. చట్టాలకు మద్దతునిస్తూ, గౌరవించడంపై చర్చించాం.'' అని ట్రూడో ఎక్స్‌లో పేర్కొన్నారు.