
తూనీగ.. తూనీగ
మాతో స్నేహం చేస్తావా
చక్కని కబుర్లు చెపుతావా
తూనీగ.. తూనీగ
మాతో సావాసం చేస్తావా
కమ్మని కథలు చెపుతావా
తూనీగ.. తూనీగ
మాతో చెలిమి చేస్తావా
తీయని రాగం తీస్తావా
తూనీగ.. తూనీగ
మాతో మైత్రి కడతావా
చక్కిలిగింతలు పెడతావా
తూనీగ.. తూనీగ
మాతో సఖ్యం గుంటావా
మాతో ఉండిపోతావా
- కయ్యూరు బాలసుబ్రమణ్యం,
77802 77240.