Nov 14,2023 20:42

ప్రజాశక్తి - విశాఖపట్నం:ప్రజాశక్తి సాహితీ సంస్థకు విశాఖపట్నం రాజీవ్‌ నగర్‌లో నివాసం ఉంటున్న షిప్‌యార్డు విశ్రాంత ఉద్యోగి జె.శివరాం రూ.50 వేలు విరాళం అందించారు. ఆ మొత్తాన్ని ప్రజాశక్తి జనరల్‌ మేనేజర్‌ ఎం.వెంకటేశ్వరరావు, విశాఖ డెస్క్‌ ఇన్‌ఛార్జి కె.అప్పలనాయుడు స్వీకరించారు. శివరాం ప్రజాశక్తి అభిమాని. షిప్‌యార్డులో పనిచేస్తున్న కాలంలో ఆయన పోరాటాల్లో పాల్గన్నారు. విరాళం అందించిన ఆయనకు ప్రజాశక్తి ఎడిటర్‌ బి.తులసీదాస్‌, సిజిఎం అచ్యుతరావు, ప్రజాశక్తి సాహితీ సంస్థ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ ధన్యవాదాలు తెలిపారు.