
హైదరాబాద్ : బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొంతమంది బీఆర్‌ఎస్ నాయకులపై దాడి చేశారని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. దీంతో ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఉత్తర్వులు వెలువడే వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.