- ఫైనల్లో అల్కరాజ్‌పై గెలుపు
న్యూయార్క్: సిన్సినాటి ఓపెన్ టోర్నమెంట్‌ను 2వ సీడ్ నొవాక్ జకోవిచ్ చేజిక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో జకోవిచ్ 5-7, 7-6(9-7), 7-6(7-4)తో టాప్‌సీడ్ కార్లోస్ అల్కరాజ్‌పై విజయం సాధించాడు. మ్యాచ్ మొత్తమ్మీద పలు మ్యాచ్ పాయింట్ల ఎదుర్కొంటూ మరీ జకోవిచ్ టైటిల్‌ను చేజిక్కించుకోవడం విశేషం. దీంతో జకోవిచ్ కెరీర్‌లో 39వ మాస్టర్స్-1000 టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే టాప్ ర్యాంక్‌కు కేవలం 20పాయింట్ల దూరంలో నిలిచాడు. తాజా ఏటిపి ర్యాంకింగ్స్‌లో జకోవిచ్ టాప్‌సీడ్ అల్కరాజ్ కంటే 20పాయింట్ల దూరంలో ఉన్నాడు. త్వరలో జరిగే యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలిరౌండ్‌లో విజయం గెలిస్తే.. మరోసారి అగ్రస్థానానికి ఎగబాకనున్నాడు.

ఇక మహిళల సింగిల్స్ సిన్సినాటి టైటిల్‌ను అమెరికాకు చెంఇన యువ క్రీడాకారిణి కోకాగాఫ్ చేజిక్కించుకుంది. ఫైనల్లో కోకా గాఫ్ 6-3, 6-4తో కరోలినా ముఛోవా(చెక్)పై విజయం సాధించింది. ఇదే క్రమంలో మహిళల సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్‌లోనూ కోకా గాఫ్ 6వ ర్యాంక్‌కు ఎగబాకింది.
ఇక భారత డబుల్స్ జోడీ రోహన్ బొప్పన్న ఒక స్థానం దిగజారి 14వ, యుకీ బాంబ్రీ 2స్థానాలు దిగజారి 64వ స్థానంలో నిలిచాడు. ఇక సింగిల్స్‌లో సుమిత్ నాగల్ 190వ,ముకుంద్ శశికుమార్ 354వ స్థానంలో నిలువగా.. ప్రజ్ఞేశ్ గుణేశ్వరన్ 520వ స్థానంలో నిలిచాడు.
ఏటిపి ర్యాంకింగ్స్(పురుషులు)
1. అల్కరాజ్(స్పెయిన్) : 9815 పాయింట్లు
2. జకోవిచ్(సెర్బియా) : 9795 పాయింట్లు
3. మెద్వదెవ్(రష్యా) : 6260 పాయింట్లు
4. రూనే(డెన్మార్క్) : 4790 పాయింట్లు
5. కాస్పర్ రూఢ్(నార్వే) : 4715 పాయింట్లు
6. జెన్నిక్ సిన్నర్(ఇటలీ) : 4645 పాయింట్లు
7. సిట్సిపాస్(గ్రీక్) : 4580 పాయింట్లు
8. రుబ్లేవ్(రష్యా) : 4515 పాయింట్లు
9. ఫ్రిట్జ్(అమెరికా) : 3605 పాయింట్లు
10. టఫీ(అమెరికా) : 3050 పాయింట్లు
-------------
మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్.
1. ఇగా స్వైటెక్(పోలండ్) : 9955 పాయింట్లు
2. అర్యానా సబలెంకా(బెలారస్) : 8746 పాయింట్లు
3. జెస్సికా పెగులా(అమెరికా) : 5945 పాయింట్లు
4. ఎలెనా రైబకినా(కజకిస్తాన్) : 5760 పాయింట్లు
5. అన్స్ జబీర్(ట్యునీషియా) : 4831 పాయింట్లు
6. కోకా గాఫ్(అమెరికా) : 4595 పాయింట్లు
7. కరోలినా గార్సియా(ఫ్రాన్స్) : 3820 పాయింట్లు
8. మరియా సక్కారి(గ్రీక్) : 3585 పాయింట్లు
9. వోండ్రుసోవా(చెక్‌రిపబ్లిక్) : 3400 పాయింట్లు
10. ముఛోవా(చెక్ రిపబ్లిక్) : 2995 పాయింట్లు










