Sep 20,2023 13:06

ప్రజాశక్తి-కాళ్ళ (పశ్చిమ గోదావరి) : జన్మభూమి మీద మమకారంతో కాళ్లకూరు గ్రామంలో దాట్ల వెంకటరామరాజు తన కుమార్తె పేరు మీద దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని డిసిసిబి ఛైర్మన్‌, వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌.నరసింహరాజు అన్నారు. కాళ్లకూరు గ్రామంలో దాట్ల శ్రీదేవి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పివిఎల్‌.నరసింహరాజు చేతుల మీదుగా బుధవారం అందజేశారు. ఒక దివ్యాంగునికి ట్రై సైకిల్‌, సుమారు లక్ష ఇరవై వేల రూపాయలు విలువైన నిత్యావసర వస్తువులు, చికెన్‌ను 20 కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి వేగేశ్న వెంకట గోపాలకృష్ణరాజు, ఎస్సీ, ఎస్టీ,బిసి, మైనార్టీ బహుజన సమైక్య వ్యవస్థాపకులు సోడదాసి గంగయ్య, సాధు.శ్రీనివాస్‌, కెంగం పెద్దిరాజు, వేగేశ్న రామకృష్ణంరాజు, నంబూరి దుర్గా ప్రసాదరాజు, బొర్రా శ్రీధర్‌ రావు, పి.యోహాను, వీరమల్లు రామ్మోహన్రావు, సతీష్‌, చిటికెన లక్ష్మీపతిరావు, కోలా ఆంజనేయులు, ఈదా బోగేష్‌, వెంకట్రావు, గణపతి పాల్గొన్నారు.