Nov 09,2023 15:04

ఆర్మూర్‌: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బిఆర్‌ఎస్‌ నామినేషన్‌ ర్యాలీలో అపశ్రుతి చోటుచేసుకుంది. బిఆర్‌ఎస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. బిఆర్‌ఎస్‌ శ్రేణులు ర్యాలీగా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి బయల్దేరారు. కేటీఆర్‌, ఇతర నేతలు ప్రచార వాహనంపై వెళ్లారు. ఈ క్రమంలో వాహన డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో కేటీఆర్‌, ఎంపీ సురేశ్‌రెడ్డి, బిఆర్‌ఎస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి కిందపడిపోయారు. సడన్‌ బ్రేక్‌తో వాహన గ్రిల్‌ ఊడిపోవడంతో వారంతా కిందపడ్డారు. ఆర్మూర్‌ పట్టణంలోని పాత ఆలూర్‌ రోడ్డు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం నామినేషన్‌ వేసేందుకు కేటీఆర్‌, నేతలు వెళ్లారు.