- రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్షం నిర్ణయం
ప్రజాశక్తి-తిరుపతి సిటీ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ బారాలను మోపడాన్ని నిరసిస్తూ ఈనెల 30వ తేదీన సీఎండీ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు అఖిలపక్ష నాయకులు తెలిపారు. సిపిఐ ఆధ్వర్యంలో బైరాగపట్టణంలోని గంధం నేని శివయ్య భవన్లో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పి.మురళి అధ్యక్షతన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజానీకంపై విద్యుత్ బారాలు మోపడం బాధాకరమన్నారు. కేంద్రంలోని బిజెపికి వంత పాడుతూ రాష్ట్రంలో రైతులకు మోటర్లకి మీటర్లు పెట్టాలని నిర్ణయించడం శోషనీయమన్నారు. ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు మోటార్లకు మీటర్లు పెట్టేందుకు అంగీకరించారని, బిజెపి పాలిత రాష్ట్రాల్లో సైతం ఈ విధానాన్ని వ్యతిరేకిస్తుంటే, జగన్ ప్రభుత్వం వంత పాడడం విడ్డూరంగా ఉందన్నారు. పైగా రాబోయే రోజుల్లో స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు చర్యలు తీసుకోనున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలని హితవు పలికారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు రామానాయుడు మాట్లాడుతూ.. పోలవరం కుడికాలువ పూర్తి అయితే 900 మెగా ఓట్ల విద్యుత్తు ఉత్పత్తి వస్తుందన్నారు. కానీ కేంద్రం దాన్ని పూర్తి చేయకుండా ధర్మల్ ద్వారా అధిక వ్యయంతో విద్యుత్తు కొనుగోలు చేస్తుందని, దీని ద్వారా ఆదానికి మేలు చేకూరుస్తుందని తెలిపారు. యూనిట్‌కి ఏడు రూపాయలు అదనంగా ప్రజల వద్ద నుంచి పిండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ద్వారాన్ని మోపుతున్నారని విమర్శించారు. రాబోవు రోజుల ప్రజలు తగిన పొరపాటు చెప్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ నగర కార్యదర్శి మాంగాటి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పెద్దలు, అధికారులు కమిషన్లకు కక్కుర్తి పడుతున్న తరుణంలో ప్రజలకు ఎలా మేలు చేపడుతుందన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన తప్పుల వల్లే నేడు ఈ పరిస్థితి దాపురించిందన్నారు. గతంలో తాను ఏపీఇఆర్సీ సభ్యుడిగా ఉన్నప్పుడు మోటార్లకు మీటర్లు వ్యతిరేకిచ్చినందుకు చైర్మన్ నాగార్జున రెడ్డి తనపై ఆగ్రహించారని గుర్తు చేశారు. ఇలాంటి వారి వల్ల ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాస నాగరాజు మాట్లాడుతూ ప్రజలు కడుతున్న విద్యుత్ బిల్లులకు ట్రూ అప్ చార్జీలు అదనంగా వేశారని, ఇది చాలదన్నట్టు 2014 నుంచి 19 వరకు వాడిన విద్యుత్తుపై అరియర్స్ పేరుతో అదనపు ఫీజును ప్రజల నుంచి వసూలు చేస్తున్నారని విమర్శించారు. సాప కింద నీరుల విద్యుత్ ఛార్జీలను మోపుతున్న ప్రభుత్వం, ప్రజలకు మేలు చేస్తుంది అనుకోవడం పొరపాటేనన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఆర్ పి ఐ రాష్ట్ర అధ్యక్షులు అంజయ్య మాట్లాడుతూ గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచాలంటే ప్రజాభిప్రాయాలను సేకరించి, వారి ఆవేదనలు అర్థం చేసుకొని చార్జీలు పెంచాల వద్ద నిర్ణయించేవారన్నారు. నేడు ఆన్లైన్లో పేరుతో అభిప్రాయాలు తీసుకుంటామంటూ, వినియోగదారులకే తెలియకుండా బారాలు మోపుతున్నారని గుర్తు చేశారు. భవిష్యత్తులో చేపట్టబోయే విద్యుత్ ఉద్యమాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. టిడిపి నాయకులు ఊకా విజయకుమార్ మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలలో ఏడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. కరెంటు వాడకని డబ్బులు కట్టాల్సిన పరిస్థితులు దాపరిచాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ ఉద్యమానికి టిడిపి మద్దతు తెలియజేస్తుందన్నారు. అనంతరం ఆకీలాపక్ష నాయకులు ఏకగ్రీవంగా ఈనెల 30వ తేదీన ఎస్పీడీసీఎల్ సిఎండి కార్యాలయాన్ని ముట్టడించేందుకు నిర్ణయించారు. ఈ ఆందోళనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు విశ్వనాథ్, సిపిఎం నాయకులు ఆర్ లక్ష్మి, మాధవ్, సుబ్రహ్మణ్యం, ఏఐటీయూసీ నాయకులు రాధాకష్ణ, ఆర్ సి మునికష్ణ, చినబాబు, ప్రజా సంఘాల నాయకులు, కార్మిక, విద్యార్థి, మహిళ సంఘాల నాయకులు పాల్గొన్నారు.










