విక్రమ్ నటిస్తున్న కొత్త చిత్రం 'ధ్రువ నక్షత్రం'. గౌతమ్ వాసు దేవ్ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి చిత్రబృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. 'మరో 8 రోజుల్లో మీ కోసం.. సిద్ధంగా ఉండండి..' అంటూ రిలీజ్ డేట్‌ను గుర్తు చేస్తూ ఈ పోస్టర్ డిజైన్ చేశారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్, సిమ్రాన్, రాధికా ఇతర నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్, కొండదువోం ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్స్ పిక్చర్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. యాక్షన్ స్పై జోనర్‌లో వస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ జాన్/ధ్రువ్ పాత్రల్లో కనిపించబోతున్నాడు. నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.