తిరువూరు (ఎన్టీఆర్ జిల్లా) : కరెంట్ బిల్లులను మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీపురంలో కాకుండా తిరువూరు పట్టణంలోనే కట్టించుకోవాలని సిపిఎం అధ్వర్యంలో వినియోగదారులు లక్ష్మీపురం విద్యుత్ ఎడిఇ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా చేశారు. తిరువూరు పట్టణంలో16 వేల మీటర్లు కలిగి ఉన్న వినియోగదారులు లక్ష్మీపురంకు వచ్చి కరెంటు బిల్లులు కట్టాలన్నా, ఏదైనా ఫిర్యాదు చేయాలన్నా భారంగా ఉందని, ఆటోకు రావాలంటే రాను,పోను 50 రూపాయలు ఖర్చవుతున్నాయని ఎఈ, అకౌంటెంట్ అధికారికి వినియోగదారులు మొరపెట్టుకున్నారు. అనంతరం అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్వీ.భద్రం, బి.వెంకటేశ్వరరావు, ఏ.రవి, కే.వి.రత్నం, ఎస్.వెంకటేశ్వర్లు, పి.శ్రీనివాసరావు, పి.రామకఅష్ణ, పి.లక్ష్మణరావు, ఎం.చింతయ్య, జె.శ్రీనివాసరావు, ఎం.ఇజ్రాయిల్, బి.రమేష్, తదితర వినియోగదారులు పాల్గొన్నారు.










