Aug 14,2023 14:44

ప్రజాశక్తి - పెద్దాపురం (కాకినాడ) : టిడిపి పాలనతోనే రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సోమవారం పెద్దాపురం మండలం ఆనూరు గ్రామంలో జరిగిన మహాశక్తి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ఏడాదిలో ప్రతి కుటుంబానికి రూ1.22 లక్షలు లబ్ధి చేకూరే విధంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని రూపొందించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రాజా సూరిబాబు రాజు,కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు జ్యోతుల నవీన్‌ కుమార్‌,మాజీ మేయర్‌ సుంకర పావని,తిరుమల కుమార్‌, కొత్తిం కోటి, కందుల విశ్వేశ్వరరావు, మొయిళ్ళ కష్ణమూర్తి, రేలంగి వెంకటరావు, అడబాల కుమారస్వామి, తుమ్మల నాని, సుబ్రహ్మణ్యం, సతీష్‌, ఎగ్గాడ శ్రీను, నిమ్మకాయల కిరణ్‌, బలుసు వాసు, సాల్మన్‌ రాజు, రామలక్ష్మి, సూర్యావతి తదితరులు పాల్గొన్నారు.