న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాదిలో ఇప్పటి వరకు అమెజాన్ గ్లోబల్ విక్రయాల్లో భారతదేశం నుంచి 1.25 లక్షల ఎగుమతిదారులు 8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.66వేల కోట్లు) విలువ చేసే ఎగుమతులు చేశారని ఆ సంస్థ తెలిపింది. 2015లో నుంచి ఈ కార్యక్రమం ద్వారా 266 మిలియన్లకు పైగా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని పేర్కొంది. అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్‌లో 1,200 కన్నా ఎక్కువ మంది భారతీయ ఎగుమతిదారులు 2022లో విక్రయాలలో రూ.1 కోటి ఆదాయాన్ని నమోదు చేశారని తెలిపింది. 2022లో ఎగుమతుల విభాగంలో బమ్మలు 50శాతం వృద్థిని నమోదు చేయగా.. ఇల్లు, వంటగది (35%), సౌందర్య ఉత్పత్తులు (25%), ఫర్నిచర్ (20%) విభాగాలు మెరుగైన పెరుగుదలను చవి చూశాయని తెలిపింది.










