కీవ్ : ఉక్రెయిన్ రక్షణ మంత్రిని ఈ వారంలో మార్చనున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. క్రిమియా నేత రుస్తెమ్ ఉమ్‌రోవ్‌ను కొత్త రక్షణ మంత్రిగా నియమించనున్నట్లు ఆయన టెలిగ్రామ్‌లో ప్రకటించారు. 550 రోజుల పాటు పూర్తి స్థాయి యుద్దాన్ని సాగించిన తర్వాత కొత్త నాయకత్వం అవసరమైందని ఆయన ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. సైనికపరంగా, సమాజ పరంగా కొత్త కొత్త వైఖరులతో, విభిన్నమైన కార్యాచరణ రూపాలతో వ్యవహరించడం అవసరమని భావిస్తున్నట్లు చెప్పారు. ఉమరోవ్ గురించి అందరికీ తెలుసునని, కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఆయన అభ్యర్ధిత్వానికి పార్లమెంట్ నుంచి కూడా మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.