
హాంగ్జౌ(చైనా): చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా పారా ఒలింపిక్స్‌లో దీప్తి జీవంజి రికార్డు నెలకొల్పింది. మంగళవారం జరిగిన మహిళల 400మీ.టిా20లో పరుగును దీప్తి 56.69సెకన్లలో గమ్యానికి చేరి సరికొత్త రికార్డు నెలకొల్పడంతోపాటు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇక పురుషుల విభాగంలో అజరు కుమార్ 400మీ. టిా64ల ఈవెంట్‌లో రజత పతకం సాధించాడు. ఇక మనీష్ కౌరవ్ కనోరు కెఎల్-3లో కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు. దీంతో ఈ క్రీడల్లో భారత్‌కు మొత్తం 17 పతకాలు దక్కినట్లైంది. ఇందులో 6స్వర్ణ, 6రజతాలతోపాటు మరో 5 కాంస్యాలున్నాయి. 2018 జకార్తా వేదికగా జరిగిన ఆసియా పారా క్రీడల్లో భారత్‌కు 72 పతకాలు దక్కాయి. ఇందులో 15స్వర్ణ పతకాలున్నాయి.