Aug 21,2023 07:45

ప్రేమ రెండు అక్షరాలు
రెండు మనసులు
ఇద్దరు మనుషులు
అదొక కులం ఇదొక కులం
కలిసారు
కథ ఒడిసి పోలే!

కులం బుసలు కొట్టింది
పితృస్వామ్యం జడలు విప్పింది
అన్న ప్రేమ
చెల్లెలి వివస్త్ర దాకా
మధ్యలో కత్తిపోట్లు!
కట్టివేత తాళ్ళతో!

వివస్త్రను గావిస్తున్నా
పెగలని గొంతులు
బిగుసుకోని పిడికిళ్లు
కారణం ఆమె
నిచ్చెన మెట్లలో చివరి మెట్టు!

కేసు వుండదు
ఆమెకి పరువు వుండదు
ఆమెకి ఆత్మాభిమానం వుండకూడదు
ఆమె ఓ పరీక్షా నాళికలో భాస్వరం
లోలోనే మండాలి!
బైట పడితే రాజ్యం ఆమెది కాదు,
వెల కట్టే రాజ్యం సిద్ధం!

పశ్చిమం లేదు ఉత్తరం లేదు
ఈశాన్యం లేదుదక్షిణం లేదు
ఎక్కడైనా ఆమె కిందే!
కిమ్మనకుండా వుండాల్సిందే
రాజ్యం ఆమెదయ్యే దాకా!
 

- గిరి ప్రసాద్‌ చెలమల్లు
94933 88201