ప్రజాశక్తి -కర్నూలు కార్పొరేషన్ : కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ క్లాప్ డ్రైవర్ల పెండింగ్ జీతాలు ఇవ్వాలని,అగ్రిమెంట్ ప్రకారం 18,500 రూపాయలు జీతం, పిఎఫ్, ఈఎస్‌ఐ,వీక్లీ ఆఫ్, అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని,పని భద్రత కల్పించాలని కోరుతూ క్లాప్ ఆటో యూనియన్ నాయకులు ఇస్మాయిల్ అధ్యక్షతన పున్నమి గెస్ట్ హౌస్ వెనకాల క్లాప్ ఆటోలు నిలబెట్టే స్థలం నుండి రామలింగేశ్వర నగర్, వెంకటరమణ కాలనీ మెయిన్ రోడ్డు మీదుగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు అబ్దుల్ దేశారు,రామాంజనేయులు (విజరు),న్యూ సిటీ కార్యదర్శి సాయిబాబా పాల్గని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కర్నూలు నగరాన్నిచెత్త లేని నగరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద్రాప్రదేశ్ క్లాప్ ఆటోలను నడిపే డ్రైవరన్నలు పనిచేస్తున్న 4నెలల నుండి 8 నెలల జీతాలు ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచడం వలన కార్మికుల కుటుంబాలు పస్తులున్న పనిచేస్తున్నారని తెలిపారు, అగ్రిమెంట్ ప్రకారం 18,500 జీతం ఇవ్వకుండా, తక్కువ జీతాలు ఇస్తూ వారి జీతంలో నుండి ఈఎస్‌ఐ, పిఎఫ్ కటింగ్ చేస్తున్న ఈఎస్‌ఐ కార్డు గాని, పిఎఫ్ అకౌంట్లు ఇవ్వకుండా కార్మికులను మోసం చేస్తున్నారని తెలిపారు. కార్మికుల కడుపు కాలి కుటుంబాలను పోషించుకో లేక అనేక ఇబ్బందులు పడుతూ అప్పులు చేసి బ్రతకవలసి వస్తుందని వారు బాధ వ్యక్తం చేశారు. అక్రమంగా అకారణంగా తొలగించిన రఘును, సాయిచరణ్ లకు డ్యూటీ ఇవ్వకుండా వేధిస్తున్నారని గుర్తు చేశారు. కార్మికులకు పెండింగ్ జీతాలు ఇప్పించి, అగ్రిమెంట్ ప్రకారం జీతం ఈఎస్‌ఐ, పి ఎఫ్, వీక్లీ ఆఫ్ లు, అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోనికి తీసుకొని, పని భద్రత కల్పించాలని కోరుతూ కర్నూలు ఎమ్మెల్యే హఫీస్ ఖాన్ కు, స్పందనలో కలెక్టర్ కు, కర్నూలు మున్సిపల్ కమీషనర్ , మేయర్ లకు, కార్మిక శాఖ అధికార్లకు,రెడ్డి ఏజెన్సీవారిని కలిసి అర్జీల రూపంలో కార్మికుల సమస్యల వాళ్ళ దఅష్టికి తీసుకెళ్లిన పరిష్కారం కాలేదు. కాబట్టి ఈనెల 19 లోగా సమస్యలు పరిష్కారం కాకపోతే 20 తేది నుండి క్లాప్ ఆటోలను బంద్ చేసి, సమ్మె చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కుమార్,వెంకటస్వామి క్లాప్ డ్రైవర్లు అందరూ ఆటోలు నిలిపి పాల్గొన్నారు.










