Aug 08,2023 17:27

ఐపీఎల్‌ 2024 సీజన్‌కి ముందు టైటిల్‌ గెలవలేకపోయిన ఫ్రాంఛైజీలన్నీ కోచ్‌లను మార్చే పనిలో పడ్డాయి. ఆర్‌సీబీ కొత్త కోచ్‌గా ఆండీ ఫ్లవర్‌ బాధ్యతలు తీసుకోగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ హెడ్‌ కోచ్‌గా జస్టిన్‌ లాంగర్‌ బాధ్యతలు తీసుకున్నాడు. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా హెడ్‌ కోచ్‌ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది.. న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌, మాజీ ఆల్‌రౌండర్‌ డేనియల్‌ వెట్టోరీని హెడ్‌ కోచ్‌గా నియమించింది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. డేనియల్‌ వెట్టోరీ ఇంతకుముందు 2014 నుంచి 2018 వరకూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకి హెడ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. 2016లో డేనియల్‌ వెట్టోరీ కోచింగ్‌లోనే ఫైనల్‌కి చేరింది రాయల్‌ ఛాలెంజర్స్‌. 2016 ఐపీఎల్‌ ఫైనల్‌లో ఆర్‌సీబీని ఓడించి, మొట్టమొదటి టైటిల్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కి 2024 సీజన్‌లో కోచ్‌గా డేనియల్‌ వెట్టోరీ వ్యవహరించబోతున్నాడు.