Aug 31,2023 15:57

ప్రజాశక్తి -పులివెందుల రూరల్‌ : పులివెందుల పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయం సమీపంలో శుక్రవారం ద్విచక్ర వాహనాన్ని స్కార్పియో డీకొట్టడంతో ద్విచక్ర వాహనంలో వస్తున్న ఊడగండ్ల వలి(43), ఆయన భార్య రమీజా (35)లు మృతి చెందారు. వివరాల మేరకు పులివెందుల మండలం కానేపల్లి గ్రామానికి చెందిన వలి తన కొడుకు బాల కులాయప్పకు కడుపునొప్పి రావడంతో చికిత్స కోసం తన భార్య రమీజా ను తీసుకొని ద్విచక్ర వాహనంపై బయలుదేరారు పులివెందుల శ్రీకృష్ణుని గుడి ఆలయ సమీపంలో శిల్పారామం రోడ్‌ లో వస్తున్న స్కార్పియో ద్విచక్ర వాహనం నుండి కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వలి అక్కడికక్కడే మృతి చెందాడు అతని భార్య రమీజాకు , కొడుకు బాల కులాయప్పకు తీవ్ర గాయాలు , వెంటనే వారిని అంబులెన్స్‌ వాహనంలో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రమీజా మఅతి చెందింది, ప్రస్తుతానికి కులాయప్పకు ప్రధమ చికిత్స చేశారు ప్రాణాయామం ఏమీలేదని అన్నారు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో,వీరికి ఉన్న ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. ఈ విషయం తెలుసుకున్న వారి బంధువులు ఏరియా ఆసుపత్రికి చేరుకొని బోరు విలపించారు. అనంతరం ఈ మృతదేహాలను పోస్టుమార్టం గదికి తరలించారు.