ప్రజలకు హానికలిగించే కోళ్ళ ఫారం నిర్మాణాన్ని ఆపాలి : వ్య.కా.స-సిపిఎం వినతి

రెడ్డిగూడెం (ఎన్‌టిఆర్) : ప్రజలకి హాని కలిగించే కోళ్ల ఫారం నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని విస్సన్నపేట తహశీల్దార్ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఎం నేతలు సోమవారం వినతిపత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు, మండల డిప్యూటీ తహశీల్దార్ మోతియాలాల్ మాట్లాడుతూ ... ప్రజలకు హాని కలగటమే కాకుండా వ్యవసాయాన్ని పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించే కోళ్ల ఫారం నిర్మాణం ఆపివేయాలని గత కొద్ది రోజులుగా వేమిరెడ్డిపల్లి పంచాయతీ నర్మదా నగర్ గ్రామ ప్రజలు చేపట్టిన ఉద్యమానికి వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం అన్ని వేళలా అండగా ఉంటుందని తెలియజేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవతో నర్మదా నగర్ లో నిర్మిస్తున్న స్నేహ ఫల్టీ కోళ్ల ఫారం నిర్మాణాన్ని ఆపాలని విజ్ఞప్తి చేశారు. 92 వ పంచాయతీ తీర్మానాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం విస్సన్నపేట టౌన్ కార్యదర్శి మేకల జ్ఞాన రత్నం, ధనమ్మ, గద్దల రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కిషోర్, తదితరులు పాల్గొన్నారు.