మహబూబ్ నగర్: సిఐపై కానిస్టేబుల్ దాడి చేసి సిఐ మర్మాంగాన్ని కోసిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో సిఐగా పని చేస్తున్న ఇఫ్తార్ అహ్మద్ పై మరో పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సిఐని చికిత్స కోసం హుటాహుటిన స్థానిక ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ తరలించినట్టు సమాచారం. కానిస్టేబుల్ భార్యతో సిఐ వివాహేతర సంబంధం కారణంగానే ఈ దాడి జరిగినట్టు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.