Aug 31,2023 17:32

ప్రజాశక్తి -పత్తికొండ: ఈనెల 2న పత్తికొండలో తలపెట్టిన సిపిఐ బస్సు యాత్ర బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్‌ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని దూదేకొండ, కోతి రాళ్ల, పులికొండ, కనక దిన్నె, హౌసూర్‌, పుచ్చకాయల మాడ గ్రామాలలో సిపిఐ ప్రతినిధి బఅందం విస్తఅతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక పాలక ప్రభుత్వాలను ఇంటికి సాగనంపి, రాష్ట్రాన్ని రక్షించుకుందాం- దేశాన్ని కాపాడుకుందాం అన్నారు. హంద్రీనీవా ద్వారా పత్తికొండ నియోజకవర్గం లో చెరువులన్నింటికీ నీళ్ళు నింపాలని డిమాండ్‌ చేశారు. కుడి, ఎడమ కాలువ పనులను తక్షణమే పూర్తి చేసి పంట పొలాలకు సాగునీరు అందించాలన్నారు. పత్తికొండ ప్రాంతం ఎడారిగా మారిపోతుందని హంద్రీనీవా ఏకైక మార్గమని పంట పొలాలకు నీళ్లు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రజాప్రతినిధులు ఏమాత్రం ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా పోవడం ద్వారా గత పది సంవత్సరాల నుండి గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వారు పంట పొలాలు నీళ్లు ఇస్తామని చెరులకు నీళ్లు మల్లి ఇస్తామని ఉతుత్త వాగ్దానాలు చేస్తూ పత్తికొండ నియోజకవర్గం ప్రజలు మభ్యపెట్టి నిర గడుపుతున్నారని దేవనకొండ రైతు రుణాలను మాఫీ చేసి, పత్తికొండ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలన్నారు. ఈనెల 2న పత్తికొండలో తలపెట్టిన బస్సు యాత్ర బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకఅష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు లు హాజరవుతారని, రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, మహిళలు, విద్యార్థి, యువజన సంఘాలు అధిక సంఖ్యలో పాల్గని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు కారన్న, ఏఐఎస్‌ఎఫ్‌ పట్టణ అధ్యక్షులు రమేష్‌, సుధాకర్‌ తదితరులుపాల్గొన్నారు.