
ప్రజాశక్తి-పాలకొల్లు (పశ్చిమగోదావరి) : నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా పాలకొల్లు మండలం దిగమర్రు నుంచి చించినాడ వరకు కట్టిన అనేక ఫ్లెక్సీలను వైసిపి దుండగులు చింపేశారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం పాలకొల్లు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు లోకేష్‌కు స్వాగతం పలుకుతూ కట్టిన ఫ్లెక్సీలు చింపేశారని తెలిపారు. ప్రశాంతంగా ఉండే జిల్లాను రణరంగంగా తయారుచేస్తున్నారని పేర్కొన్నారు. ఇంకా టిడిపి నేతలు పెచ్చెట్టి బాబు, మామిడి శెట్టి పెద్దిరాజు, కోడి విజయ భాస్కర్, దాసరి రత్నరాజు, మాతా రత్నరాజు, జివి, పాలవలస తులసీరావు పాల్గొన్నారు.