
తామర పూలను తెస్తాం
తనివితీరా మాల కడతాం
తల్లిదండ్రుల మెడలో వేస్తాం!
గులాబి పూలను తెస్తాం
గుత్తులు గుత్తుల మాల కడతాం
గురువు గారి మెడలో వేస్తాం!
చామంతి పూలను తెస్తాం
చక చకా మాల కడతాం
చదువుల తల్లి మెడలో వేస్తాం!
మందార పూలను తెస్తాం
మెలికలేసి మాల కడతాం
మహనీయుల మెడలో వేస్తాం!
బంతి పూలను తెస్తాం
బొద్దు బొద్దుగా మాల కడతాం
భరత మాత మెడలో వేస్తాం!
నందివర్ధన పూలను తెస్తాం
నిగనిగలాడే మాల కడతాం
నింగి నేలకు చుట్టేస్తాం!
- బోనగిరి పాండురంగ,
తొర్రూరు.