Jul 21,2023 16:38

బోగటా : కొలంబియన్లు తమ స్వాతంత్య్ర దినోత్సవాన్ని (జూలై 20) స్మరించుకుంటూ అధ్యక్షుడు గుస్తావో పెట్రోకి మద్దతుగా మార్చ్‌ నిర్వహించేందుకు కార్మిక సంఘాలు గురువారం పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే వర్కర్స్‌ యూనిటరీ సెంట్రల్‌ (సియుటి) మార్చ్‌కు పిలుపునిచ్చింది. ఈ మార్చ్‌లో కొలంబియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎడ్యుకేటర్స్‌ (ఎఫ్‌ఇసిఓడిఇ) వంటి సంస్థలు కూడా పాల్గొనన్నాయి. కార్మిక సంఘాల పిలుపు మేరకు కొలంబియా పౌరులు బోగొటాలోని బొలివర్‌ స్క్వేర్‌ వద్దకి మధ్యాహ్నం 2 గంటల సమయానికి చేరుకున్నారు. శాసనసభా సమావేశాల్లో కార్మికులకు సంబంధించిన పెన్షన్‌, ఆరోగ్య నిబంధనలను సంస్కరించడానికి బిల్లులను సమర్పించబోయే ముందు అధ్యక్షుడు పెట్రోకు మద్దతుగా కార్మికులు మార్చ్‌ని నిర్వహించారు. దీనిపై సియుటి అధ్యక్షుడు ఫాబియో అరియాస్‌ మాట్లాడుతూ.. 'పెట్రో తెస్తున్న సామాజిక సంస్కరణలన్నీ ప్రగతిశీలమైనవి. ఆ సంస్కరణలకు మద్దతు ఇవ్వడానికే దేశవ్యాప్తంగా పౌరులను, కార్మికులను పిలుస్తున్నాము' అని ఆయన అన్నారు.
కాగా, విద్యను ప్రైవేటీకరంచే బిల్లును మాజీ అధ్యక్షురాలు అల్వారో ఉరిబ్‌ తెచ్చారు. విద్యను ప్రైవేటీకరించే 'స్కూల్‌ బాండ్‌' బిల్లుకు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ఉద్యమించనున్నారు. విద్య ప్రైవేటీకరణకు పెట్రో ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ విద్యావ్యస్థను నాశనం చేసి... దానికయ్యే ఖర్చుతో వ్యాపారం చేసేందుకు వీలుగా మాజీ అధ్యక్షురాలు ప్రతిపాదన ఉందని ఎఫ్‌ఇసిఓడిఇ ఆరోపించింది. కేవలం లౌకిక ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి కొత్త మితవాదుల ప్రయత్నమని ఎఫ్‌ఇసిఓడిఇ విమర్శించింది.