ప్రజాశక్తి - పుత్తూరు టౌన్(తిరుపతి) : వడమాలపేట మండలంలోని బాలుర ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి శేఖర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్ర ఆవరణంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి వ్యక్తులను ఎవరినీ అనుమతించరాదని చీఫ్ సుపరింటెండెంట్‌ను ఆదేశించారు. త్రాగు నీరు ఏర్పాటు, ఎఎన్‌ఎం ప్రథమ చికిత్స మందులు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. పాఠశాల పరిసరాలలో, పరీక్ష కేంద్రంలో పరిశుభ్రత వంటి వాటిని సరిగా అమలు చేయాలని సూచించారు.










