ప్రజాశక్తి-సంతబొమ్మాళి (శ్రీకాకుళం) : జగన్నాథపురం గ్రామానికి వెళ్ళే ప్రధాన రహదారి కోసం వంశధార కాలువపై నిర్మించిన వంతెన శుక్రవారం రాత్రి కూలిపోవడంతో గ్రామస్తుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిన్న సాయంత్రం కురిసిన వర్షాలకు వంశధార కాలువలో వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో శిధిలావస్థకు చేరుకున్న వంతెన కూలిపోయింది. వంతెన తప్ప గ్రామానికి ఎలాంటి రహదారి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారిని పునరుద్ధరించాలని స్థానిక సర్పంచ్ జోగి రాములమ్మను గ్రామస్తులు శనివారం కోరారు.










