
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, నిర్వహణపైన, రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలోనూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యాలు. పాలకుల తీరుతెన్నులను కాగ్ వెల్లడించింది. సామాన్యులకు ప్రభుత్వ సేవలను క్షేత్రస్థాయిలో అందించడంలో సచివాలయ వ్యవస్థ పాత్ర పోషిస్తున్నప్పటికీ రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగార్చేలా ఉంది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదాను అందించింది. ఈ చట్టం భారత రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్‌లో పేర్కొన్న 18 విధులు నిర్వహించేందుకు పట్టణ స్థానిక సంస్థలకు అధికారం ఇచ్చింది. వాటిలో 13 విధులను పూర్తిగాను, మూడు విధులను పాక్షికంగానూ నగర పాలక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇక పురపాలక / నగర పంచాయతీల విషయానికి వస్తే ఏడు విధులను పూర్తిగాను, ఐదు విధులను పాక్షికంగానూ అప్పగించింది. వార్డు, గ్రామ సచివాలయాల వ్యవస్థను 2019 జులై నుంచి నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో రాష్ట్రప్రభుత్వం అమలు చేయడం ప్రారంభించింది. రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు జరపడం లేదు. ఎక్కువ స్థానిక సంస్థలు ఎన్నికైన ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా రాష్ట్రప్రభుత్వ కనుసన్నల్లో... ప్రత్యేక అధికారుల పాలనలోనే మగ్గుతున్నాయి. ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పౌరులను భాగస్వామ్యం చేయడం, పౌరులకు పాలనను చేరువ చేయడం స్థానిక స్వపరిపాలన ప్రధాన లక్ష్యం. రాష్ట్రంలో ఎక్కడా వార్డు కమిటీలను ఏర్పాటు చేయనే లేదు. ఇక పౌరులను భాగస్వామ్యం చేసే పరిస్థితి అసలు లేదు. ఇవి రెండూ చేపట్టకుండా వార్డు స్థాయిలో సచివాలయాల వ్యవస్థ రూపుదిద్దుకోవడం స్థానిక స్వపరిపాలనకు ఉద్దేశించిన రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగార్చడమే. వార్డు కమిటీలను ఏర్పాటు చేసి, ఆయా కమిటీలు, ఏరియా సభలతో వార్డు సచివాలయాలను అనుసంధానం చేస్తేనే స్వపరిపాలన సాధ్యమవుతుందున్న కాగ్ సిఫార్సులు అనుసరణీయం. 74వ రాజ్యాంగ సవరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టాల్లోని నిబంధనలకు అనుగుణంగా పాలన నడవాలి.
కేంద్రప్రభుత్వం మెడలు వంచి నిధులు రాబట్టలేకపోవడం, గత, ప్రస్తుత ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్వాకం రాజధాని అమరావతికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారినా... ప్రజలకు సేవ చేసే విషయంలో పోటీపడి, ప్రజాధనానికి నష్టం కలగకుండా చేయాల్సిన బృహత్తర కర్తవ్యం పాలకులది. ఆ స్ఫూర్తిని ప్రభుత్వాలు మంటగలిపితే... కలిగే అనర్థాలకు అమరావతి ఓ సజీవ సాక్ష్యం. 2019 నుంచి అమరావతికి బడ్జెట్ సహకారం లేకపోవడం, రూ.33,476 కోట్లు రుణంగా సమీకరిరచు కోవాల్సి ఉరడగా, రూ.8,540 కోట్లే సమీకరించడం, కాలపరిమితి లేకురడా ఉన్న 55 ప్యాకేజిల ఒప్పందాలపై అనిశ్చితి, వాటిని పూర్తి చేయడానికి అవసరమైన రూ.28,048 కోట్లపై స్పష్టత లేకపోవడం... ఇలా ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని కాగ్ ఎండగట్టింది. భూసమీకరణకు రూ.2,245 కోట్లు సిఆర్‌డిఎ వ్యయం చేయగా, ఆ భూమంతా నిరుపయోగంగా పడి వుంది. ఈ విషయంలో అమరావతిని ఒక భ్రమరావతిలా కంప్యూటర్ గ్రాఫిక్స్ చూపిన గత ప్రభుత్వ నిర్వాకం కూడా సరికాదు. ప్రభుత్వ భూములను వదిలేసి ప్రైవేటు భూములనే రాజధానికి సేకరించడం, 70 శాతాన్ని భూసమీకరణ ద్వారా సేకరిరచాలని అప్పట్లో తీసుకున్న నిర్ణయాన్ని కాగ్ నివేదిక ఆక్షేపించింది. ఈ నిర్ణయం కారణంగా రానున్న కాలంలో భారీ ఆర్థిక భారం పడనుందని హెచ్చరించింది. మాస్టర్ ప్లాన్ తయారీలో కన్సల్టెరట్లను నామినేషన్ పద్ధతిలో ఎరపిక చేయడం, స్పష్టమైన ఆర్థిక ప్రణాళికలు లేకుండా రూ.33,476 కోట్లతో సిఆర్‌డిఎ, ఎడిసిఎల్‌లు అనేక ప్యాకేజీలకు ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి ఎన్నో! ఫలితంగా 2016 నురచి 2023 వరకు రూ.55,343 కోట్లు అవసరం కాగా, కేవలం రూ.11,487 కోట్లు మాత్రమే సమీకరిరచుకోగలిగారు. రాజధాని నేటికీ పూర్తికాలేదు. భూములిచ్చిన రైతులు రోడ్డున పడ్డారు. ఇప్పటికైనా రాజధాని అమరావతి నిర్మాణాన్ని పూర్తిచేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.