
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్‌లో భారత స్టార్ షట్లర్లు చిరాగ్‌ాసాత్విక్ జోడీ శుభారంభం చేశారు. మంగళవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో సాత్విక్‌ాచిరాగ్ జంట 21-13, 21-13తో 34వ ర్యాంకర్స్ లూకాస్-రోనన్(ఫ్రాన్స్)జోడీని చిత్తుచేశారు. ఈ మ్యాచ్‌ను భారత షట్లర్లు కేవలం 35 నిమిషాల్లోనే ముగించారు. ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించడంతో భారత డబుల్స్ తొలిసారి ఓ టోర్నమెంట్‌లో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగారు. ఇక మహిళల డబుల్స్‌లో భారత్‌కు చెందిన శ్వేతపర్ణారుతుపర్ణ 6-21, 16-21తో చైనా జంట చేతిలో ఓటమిపాలయ్యారు.
సింధు శుభారంభం..
ఇక మహిళల సింగిల్స్‌లో పివి సింధు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో సింధు 12-21, 21-18, 21-15తో గ్రెగోరియా మరిస్కా(ఇండోనేషియా)పై చెమటోడ్చి నెగ్గింది. తొలి గేమ్‌ను సునాయాసంగా కోల్పోయిన సింధు.. ఆ తర్వాత రెండు, మూడు గేమ్‌లలో సత్తా చాటి మ్యాచ్‌ను ముగిచింది.