
హైదరాబాద్: సీనియర్ నటుడు చంద్రమోహన్ అంత్యక్రియలు ముగిశాయి. చంద్రమోహన్ తీవ్ర అనారోగ్యం కారణంగా నవంబరు 11న కన్నుమూశారు. అమెరికాలో ఉన్న పెద్ద కుమార్తె ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఉదయం హైదరాబాద్ ఫిలింనగర్ లోని ఆయన నివాసం నుంచి పంజాగుట్ట శ్మశానవాటిక వరకు అంతిమయాత్ర జరిగింది. అశ్రునయనాల మధ్య ఆయన అంతిమ సంస్కారాలు ముగిశాయి. చంద్రమోహన్ సోదరుడు దుర్గాప్రసాద్ అంతిమ సంస్కారాలు జరిపారు. చంద్రమోహన్ భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు కడసారి నివాళులు అర్పించారు. చంద్రమోహన్ కు గతంలో బైపాస్ సర్జరీ జరిగింది. హఅద్రోగంతో పాటు కిడ్నీ సంబంధ సమస్య కూడా తలెత్తడంతో ఆయన కోలుకోలేకపోయారు. శనివారం నాడు తన నివాసంలో సొమ్మసిల్లి పడిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.